క్రికెట్ లో ఊహకందని క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు పంజాబ్ వికెట్ కీపర్ ప్రబు సిమ్రాన్ సింగ్. దేవధర్ ట్రోఫీలో భాగంగా ఈ క్యాచ్ చోటు చేసుకుంది.
దేవధర్ ట్రోఫీలో భాగంగా నిన్న సౌత్ జోన్, నార్త్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కునాల్(70) మయాంక్ అగర్వాల్ (64), జగదేశాన్ (72) అర్ధ సెంచరీలు చేశారు. నార్త్ జోన్ బౌలర్లలో మార్ఖండే, రిషి ధావన్ కి చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో నార్త్ జోన్ జట్టు కేవలం 60 పరుగులకే కుప్పకూలింది. జట్టులో ఖజూరియ(10) మందీప్ సింగ్ (18) మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కావేరప్ప 5 వికెట్లతో నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్ విషయం పక్కన పెడితే ఈ మ్యాచులో నార్త్ జోన్ వికెట్ కీపర్ ప్రబు సిమ్రాన్ సింగ్ అందుకున్న ఒక క్యాచ్ నభూతో భవిష్యత్ అనే రీతిలో ఉంది.
క్రికెట్ లో ఇప్పటికే చాలా గ్రేట్ క్యాచులు చూసే ఉంటాము. వీటిలో కొన్ని నమ్మశక్యం కానీ రీతిలో ఉండి అభిమానులని షాక్ కి గురి చేస్తాయి. తాజాగా ప్రబు సిమ్రాన్ సింగ్ పట్టిన క్యాచ్ ఆ లిస్టులోకి వస్తుంది. వివల్లోకెళ్తే సౌత్ జోన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 39 ఓవర్లో మయాంక్ యాదవ్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతిని రికీ బుయికి షార్ట్ బాల్ ని విసిరాడు. దీంతో ఈ బంతిని అప్పర్ కట్ చేయాలని భావించిన బుయి.. వికెట్ కీపర్ ప్రబు సిమ్రాన్ సింగ్ చేతికి చిక్కాడు. చాలా దూరంగా వెళ్తున్న ఈ బంతిని పక్షిలాగా డైవ్ చేసి క్యాచ్ ని ఒడిసి పట్టాడు. విమానం లాగా పూర్తిగా గాలిలో తేలిపోయిన సిమ్రాన్ సింగ్ అందుకున్న ఈ క్యాచ్ చూస్తే వావ్ అనాల్సిందే. అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఈ క్యాచ్ కి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రబు సిమ్రాన్ సింగ్ పట్టిన ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యాచ్ చూసేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Ripper Alert 🚨
You do not want to miss Prabhsimran Singh’s flying catch behind the stumps 🔥🔥
WATCH Now 🎥🔽 #DeodharTrophy | #NZvSZhttps://t.co/Tr2XHldbHY
— BCCI Domestic (@BCCIdomestic) July 24, 2023