సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. పలు విషయాలపై తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో స్పందిస్తుంటారు. తాజాగా కేటీఆర్ మూడు ప్రశ్నలను ట్వీపుల్(ట్విట్టర్ పీపుల్)కు సంధించారు. వాటికి జవాబు చెప్పండి.. అవసరం అనుకుంటే గూగుల్‌లో సెర్చ్ కూడా చేసే వెసులుబాటు కల్పించారు.
Quick General Knowledge questions to you tweeple;
1) Where is the world’s largest lift irrigation project located?
2) Who has built it & when?
3) What’s the monetary contribution of Govt of India to this project?
Google for answers if you need to and share them
— KTR (@KTRTRS) December 25, 2021
అవి ఏంటంటే.. 1. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణం అవుతుంది? 2. దాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? 3. అలాంటి ప్రాజెక్ట్‌కు భారత్ ప్రభుత్వం ఎలాంటి భాగస్వామ్యం వహించాలి? అనే ప్రశ్నలను అడిగారు. కాగా ఈ ప్రశ్నలు కాలేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం సరైన నిధులు కేటాయించడం లేదని సెటైరికల్‌గా ఆయన ఈ ట్విట్ చేసినట్లు అర్థం అవుతుంది. మరి ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.