ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన ఇండియన్ బ్యూటీ ఫ్రిదా పింటో మీకు గుర్తుందా. అదే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మే ఫ్రిదా పింటో. ఈ ఒక్క మూవీతో ఫ్రిదా పింటో రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఇండియాలోనే ఏ నటీ అందుకోనంత పారితోషికాన్ని.. అప్పట్లో తన రెండవ సినిమాతోనే అందుకుని హాట్ టాపిక్ గా నిలిచింది ఈ అమ్మడు. ఓ హాలీవుడ్ సినిమా కోసం అక్షరాల పాతిక కోట్ల పారితోషికం అందుకుని సెన్సెషన్ గా మారింది. అప్పుడు అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు మరో బిగ్ కాంట్రవర్శితో వార్తల్లో నిలిచింది.
పెళ్లి కాకుండానే తల్లిగా ప్రమోషన్ అవ్వడం ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. ఆ మధ్య అమీ జాక్సన్ కూడా పెళ్లి చేసుకుండానే తల్లి అయింది. ఇక ఇప్పుడు ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రిదా పింటో కూడా ఈ జాబితాలో చేరింది.ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లికాకుండానే తల్లి అవుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రియుడు కోరీ ట్రాన్‌తో 2017 నుండి డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మడు 2019లో అతనితో నిశ్చితార్థం జరుపుకున్నట్టు ప్రకటించింది. కానీ.., అప్పటి నుండి పెళ్లి ప్రస్తావన మాత్రం లేదు. ఈమె తాజాగా ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని పంచుకుంది. దీంతో చాలా మంది షాక్ అవుతోంటే ఈ బ్యూటీ అభిమానులు,సన్నిహితులు మాత్రం విషెస్ చెబుతున్నారు. అయితే చాలా మంది ఎలాగూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు కదా… ఆ పెళ్లి కూడా చేసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. మరి కొందరు మాత్రం నటిగా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు అంటూ ఫ్రిదా పింటోని నిలదీస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.