బిజినెస్ డెస్క్- కరోనా మహమ్మారితో కుటుంబాలు చిన్నాభిన్నమై.. ఆర్థికంగా చితికిపోయి.. జనజీవనం అస్థవ్యస్తమైంది. కొవిడ్ బారిన పడ్డ కుటుంబాలైతే ఆస్పత్రుల బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మకున్న ఉదంతాలు ఎన్నో. మరి ఇంలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మాత్రం సమాన్యులపై భారం మోపుతూనే ఉంది. ఎప్పటికప్పుడు చమురు ధరలు పెంచూతూ జనంపై భారం వేస్తోంది మోదీ సర్కారు. ఈ కాలంలో బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా బండి బయటకు తీయాల్సిందే. కానీ పెరుగుతున్న పెట్రోల్ ధరలను సూస్తే మాత్రం రోడ్డుపైకి వెళ్లాలంటేనే గుండె గుబేల్ మంటోంది. గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కొంత విరామం ఇచ్చినా, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు నుంచే మళ్లీ బాదుడు ప్రారంభమైంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్రోల్ ధర 100 రూపాలకు చేరింది. ఏపీలో ఆదివారం లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేసింది. ఆదివారం పెట్రోలుపై లీటరుకు 17 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో లీటరు పెట్రోల్ ధర 100 రూపాయల 30 పైసలకు చేరింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని పెట్రోల్ వంద రూపాయలు దాటింది. ఆంద్రప్రదేశ్ లోని మిగిలిన జిల్లాల్లోను లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువలో ఉంది. లీటరు పెట్రోల్ ధర వందకు రూపాయి నుంచి 50పైసలు మాత్రమే తక్కువగా ఉంది. దీంతో మరో రెండు మూడు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పెట్రోల్ ధర వంద రూపాయలు క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆదివారం పెరిగిన చమురు ధరలతో కర్నూలులో 99 రూపాయల 71 పైసలు, మచిలీపట్నంలో 99 రూపాయల 63 పైసలు, నెల్లూరులో లీటరు పెట్రోలు ధర 99 రూపాయల 71 పైసలు, ఏలూరులో 99 రూపాయల 64 పైసలకు చేరింది. అనంతపురంలో 99 రూపాయల 25 పైసలు, గుంటూరులో 99 రూపాయల 39 పైకలకు, కాకినాడలో 99 రూపాయల 57 పైసలకు, విజయవాడలో ధర 99 రూపాయల 41 పైసలకు చేరింది. గయ యేడాది మే నుంచి ఈ సంవత్సరం మే వరకు లీచరు పెట్రోల్ పై ఏకంగా 25 రూపాయలు పెరిగింది. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యులు వాహనాలను నడపడం కష్టమేమరి.