చార్మింగ్ బ్యూటీ ఛార్మీ కౌర్ కి తెలుగునాట పరిచయం అవసరం లేదు. “నీతోడు కావాలి” అనే సినిమాతో 14 ఏళ్ళ వయసులోనే ఛార్మీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత కాలంలో తన లేలేత అందాలను ఆరబోసి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలందరి సరసన ఆడి పాడింది ఈ ముంబాయి బ్యూటీ. అయితే.., ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలకి దూరంగా ఉంటుంది ఛార్మీ. కాగా.., ఇప్పుడు ఈ చార్మింగ్ బ్యూటీ పెళ్ళికి సిద్దమైందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా బాగా బిజీగా ఉన్న సమయంలో పెళ్లి పై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఛార్మీ. పెళ్లిపై తనకు నమ్మకం లేదని, తనకెలాంటి తోడు అవసరం లేదని ఈ గ్లామర్ గాళ్ అప్పట్లో సంచలన స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ.., ఇప్పుడు ఈ విషయంలో ఛార్మీ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛార్మీ తల్లి తండ్రులు తమ సమీప బంధువుతో అమ్మడు పెళ్లి ఫిక్స్ చేశారట. ఇక తల్లిదండ్రులు మాట కాదనలేక ఛార్మీ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి “జ్యోతిలక్ష్మీ” తరువాత ఛార్మీ ఖాతాలో చెప్పుకోతగ్గ సినిమాలు లేకుండా పోయాయి. తరువాత కాలంలో చేసిన ఒకటి.., రెండు సినిమాలు ఈమె కెరీర్ కి అంతగా ఉపయోగ పడలేదు. దీనితో.., ఈ హాట్ బ్యూటీ సినిమా నిర్మాణం పై ద్రుష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు పూరి జగన్నాధ్ కి దగ్గరైంది ఛార్మీ.
పూరి సినిమాలకి బ్యాకెండ్ వర్క్ చేస్తూ.. ఛార్మీ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే పూరితో ఛార్మీ డేటింగ్ చేస్తోందన్న వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ.., ఈ మాజీ హీరోయిన్ మాత్రం ఏనాడు ఆ వార్తలపై స్పందించింది లేదు. నిజానికి ఛార్మీకి ఇలాంటి పుకార్లు కొత్త కాదు. గతంలో ఛార్మీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో డేటింగ్ చేస్తోందన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఛార్మీ నుండి మౌనమే సమాధానం అయ్యింది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనక్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కే సినిమాలు అన్నింటిలో ఛార్మీ భాగ్య స్వామ్యం ఉంటూ వస్తోంది. ఇలా వీరి కలయికలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” సూపర్ సక్సెస్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఛార్మీ కూడా గత కొంత కాలంగా ఆ ప్రాజెక్ట్ పనులతోనే బిజీగా ఉంది. అయితే.., ఆల్ ఆఫ్ సడెన్ గా ఇలా ఛార్మీ మ్యారేజ్ ఫిక్స్ కావడం అందరికీ షాక్ కలిగిస్తోంది. అయితే.., ఛార్మీ ఈ పెళ్ళికి ఒప్పుకోవడానికి కారణం పూరి జగన్నాథ్ భార్య లావణ్యగా తెలుస్తోంది. ఇన్నాళ్లు పూరి- ఛార్మీ రిలేషన్ ని మంచి మనసుతో అర్ధం చేసుకున్న లావణ్య… ఈసారి ఛార్మిని పెళ్ళి చేసుకోమని గట్టిగానే సలహా ఇచ్చిదట. దీనితో తన శ్రేయాభిలాషుల కోరిక మేరకు ఛార్మీ పెళ్ళికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసినట్టు సమాచారం. దీనితో త్వరలోనే ఛార్మీ పెళ్లి కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.., పెళ్లి తరువాత కూడా ఈ అమ్మడు సినిమాలతోనే తన ప్రయాణమని ముందుగానే తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మరి పెళ్లి తరువాత కూడా ఛార్మీ కౌర్ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని.. ఆమెకి అడ్వాన్స్ విషెష్ తెలియ చేసుకుందాం.