రష్యా-ఉక్రెయిన్ మధ్య 23 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని నిలిపి వేయాలంటూ అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్లను రష్యా లెక్క చేయట్లేదు. తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించారు. రాజధాని కీవ్‌లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 67 ఏండ్ల ఒక్సానా మృతిచెందారని ఆమె నేతృత్వంలో పనిచేస్తున్న ‘యంగ్ థియేటర్’ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది.
ఇది చదవండి: వీడియో: చనిపోయిన తమ్ముడిని మళ్లీ బతికించిన అక్క!
1955లో జన్మించిన ఒక్సానా కేరీర్ ఆరంభంలో ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌తో అసోసియేట్ అయ్యారు. 1980లో యంగ్ థియేటర్ ట్రూప్‌లో చేరారు. ఉక్రెయిన్ ప్రభుత్వం తరఫున పలు అవార్డులను అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్టుగానే కాకుండా.. అనేక సినిమాల్లో కూడా ఆమె నటించింది. టుమారో విల్ బీ టుమారో, ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ పాట్రిక్, ది రిటర్న్ ఆఫ్ ముఖ్తార్ అనే సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.