ప్రముఖల నుంచి కోట్లకు కోట్లు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి బాధితుల్లో తాగా టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు చేశారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్ కనుమల్లి కూడా మోసపోయినట్లు సమాచారం. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శిల్పా పార్టీలకు అటెండ్ అయి ఆమె ట్రాప్‌లో పడ్డాడు ఈ యువ హీరో.
‘సెహరి’ సినిమాలో హర్ష్ కనుమల్లి హీరోగా నటించాడు. మరికొందరు సెలబ్రిటీలు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు నార్సింగి పోలీసులు. శిల్పా భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రాజేంద్రనగర్ కోర్టు. అయితే శిల్పా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు శుక్రవారం, శనివారం శిల్పాను విచారించనున్నారు.