“ఆర్.ఆర్.ఆర్”.. ఈ సినిమా కోసం ఇప్పుడు దేశం అంతాఎదురు చూస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కింది. మార్చి 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ పై చిత్ర బృందం ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే ముంబయిలో ట్రిపుల్ ఆర్ ప్రిరిలీజ్ ఈవెంట్ పూర్తి అయ్యింది. ఇక దుబాయ్‌లో కూడా భారీగా ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియా ప్రమోషన్స్ పై ఫోకస్ చేసిన జక్కన్న.. ఇందుకు కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వేదికగా చేసుకున్నాడు. తాజాగా ఇక్కడ నిర్వహించిన ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే.. ఈ స్టేజ్ పై నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.
“అందరికీ నమస్కారం. పునీత్ రాజ్‌కుమార్ మా కుటుంబ సభ్యుడు. తారక్ చెప్పినట్టు ఆయన మనల్ని వదిలి ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ఏమైనా ఉన్న లోటుని.. శివన్నతో తీర్చుకుంటాం. మేం చనిపోయే వరకు పునీత్ మా గుండెల్లో ఉంటారు” అంటూ చరణ్ కాస్త భావోద్వేగంగా తన స్పీచ్ మొదలు పెట్టాడు. ఇక ఈ ఈవెంట్ కి హాజరైన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌కు కూడా చరణ్ ధన్యవాదాలు తెలిపాడు.
“RRR ప్రయాణం అంత సులభమైనది కాదు. నాకు, తారక్‌కు నీడలాగా ఉండి అభిమానులు నడిపిస్తున్నారు. సినిమా విడుదల అవుతుంది కదా…? నీ ఫీలింగ్స్ ఏంటి అని అంతా నన్ను అడుగుతున్నారు. ప్రస్తుతం నా మైండ్ లో సినిమా రిజల్ట్ గురించి ఏమి ఆలోచన లేదు. అంతా బ్లాంక్‌గా ఉంది. ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నాను. మీరందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అంటూ చరణ్ తన ప్రసంగాన్ని ముగించాడు. మరి.. రామ్ చరణ్ స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.