పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరిమల్లు’ టీమ్… ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. దాదాపు నిమిషం డ్యూరేషన్ ఉన్న ఈ వీడియో.. సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది. ‘పిడుగే దిగొచ్చింది భళ్ళు భళ్ళున..’ అని పవర్ ఫుల్ బీజీఎం వినిపిస్తుండగా పవన్ కళ్యాణ్ వీరమల్లు గెటప్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. కండలు తిరిగిన మల్లయోధులతో ఫైట్ చేస్తూ.. ఒక్కో మల్లయోధుడిని వీరమల్లు ఎత్తి కుదేస్తూ.. మట్టి కరిపించాడు.
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్, టీజర్ లో చూపించిన మల్లయోధుల ఫైట్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. కీరవాణి బీజీఎం నెక్స్ట్ లెవల్ లో ఉంది. మొత్తంగా పవన్ బర్త్ డే రోజున దర్శకుడు క్రిష్ ఫాన్స్ ని అస్సలు నిరాశపరచలేదు. హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ”హరిహర వీరమల్లు” సినిమా తీస్తున్నారు. ఓ లెజండరీ బందిపోటు వీరోచిత గాథే ఈ సినిమా. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి హరిహర వీరమల్లు గ్లింప్స్ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ పేరిట మాల దీక్ష! ట్రెండ్ అవుతున్న పాత వీడియో!