పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరిమల్లు’ టీమ్… ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. దాదాపు నిమిషం డ్యూరేషన్ ఉన్న ఈ వీడియో.. సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది. ‘పిడుగే దిగొచ్చింది భళ్ళు భళ్ళున..’ అని పవర్ ఫుల్ బీజీఎం వినిపిస్తుండగా పవన్ కళ్యాణ్ వీరమల్లు గెటప్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. కండలు తిరిగిన మల్లయోధులతో ఫైట్ చేస్తూ.. ఒక్కో మల్లయోధుడిని వీరమల్లు ఎత్తి కుదేస్తూ.. మట్టి కరిపించాడు. […]