మణిరత్నం సినిమా అంటే ఓ మ్యాజిక్.. ఆయన సినిమాల్లో ఎదో తెలియని మాయ ఉంటుంది. సినిమా ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులను మణిరత్నం సినిమా ఆకర్షిస్తుంది. అందుకే ఆయన సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్.
మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్ఠాత్మక, భారీ బడ్జెట్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సినిమా మొదటి భాగం విడుదలైన ఆరు నెలలు లేదా అంతకంటే ఇంకా తక్కువ సమయంలోనే రెండో భాగాన్ని విడుదల చేయాలని నిర్మాణ సంస్థ యోచిస్తోంది. వచ్చే ఏడాది తమిళంలో పెద్ద హీరోల సినిమాలు విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించాయి. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందుతున్న ‘పొన్నియన్ సెల్వన్’లో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష తదితరులు నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. 140 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా దాదాపు యాభై శాతంపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవలే చిత్రబృందం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ అక్కడ కాన్సల్ అయిపోయింది. దాంతో చెన్నైలోనే షూటింగ్ కానిద్దాం అనుకుంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా కరోనా విలయతాండవం చేస్తుంది. దాంతో చేసేదేమి లేక షూటింగ్ కు ప్యాకప్ చెప్పారట. మణిరత్నం టీమ్ పరిస్థితులు చక్కబడితే జూన్ లో షూటింగ్ ప్రారంభిద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు . తొమ్మిది మంది దర్శకులతో తొమ్మిది మంది హీరోలతో నవరస అనే వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రసాన్ని చూపించనున్నారు. దర్శకుడు జయేంద్రతో కలసి మణిరత్నం ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు.