మెడికల్ షాపునకు వెళ్లాలన్నా మొహమాట పడతారు. ఇంట్లో బ్రదర్ ఉంటే వాళ్లతో తెప్పిస్తారు. బ్రదర్ లేని అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ గ్రామంలోని వారు..
ఓ పురుషుడు.. ఆడవారు నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నాడు. డబ్బు పెట్టి శానిటరీ ప్యాడ్స్ కనుక్కోలేని వారు.. బయటకు వెళ్లి షాపుల్లో తమకు శానిటరీ ప్యాడ్స్ కావాలని అడగలేని అడవాళ్ల కోసం ఉన్నతంగా ఆలోచించాడు. ఏ స్త్రీ నెలసరి సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న లక్ష్యంతో ‘ఫ్రీ ప్యాడ్ బ్యాంకు’ను ఏర్పాటు చేశాడు. ఈ బ్యాంకు ద్వారా నెలకు దాదాపు 1000 మందికి ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందిస్తున్నాడు. నెలకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ ఫ్రీ ప్యాడ్ బ్యాంకు గురించి హరీష్ మాట్లాడుతూ.. ‘‘ చిన్నపుడు నేను ఈ ప్యాడ్ల వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. అలాంటి వన్నీ వేరే వాళ్లు ఫేస్ చేయకూడదు. మన ఇంట్లో సిస్టర్ ఉంటే ఆమె వెళ్లి కొనుక్కోలేదు.
మొహమాట పడతారు. మెడికల్ షాపునకు వెళ్లాలన్నా మొహమాట పడతారు. ఇంట్లో బ్రదర్ ఉంటే వాళ్లతో తెప్పిస్తారు. బ్రదర్ లేని అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ గ్రామంలోని వారు బయటకు వెళ్లి కొనాలంటే చాలా కష్టం. ఆటో మీద వెళ్లాలి అన్నా కష్టం. అదంతా నాకు బాధ అనిపించేది. అందుకే ఇది ఏర్పాటు చేశాను. గ్రామంలోనే కాదు.. రైల్వే స్టేషన్స్లోనూ వీటి అవసరం ఉంది. ఈ ప్యాడ్ బ్యాంకుల్లో సుమారు 100 ప్యాడ్లు వేయాలి. ఒక్కో ప్యాడ్ ధర ఎమ్మార్పీ ప్రకారం 40 రూపాయలు ఉంటాది. మనకు 35 రూపాయలకే ఇస్తారు. 100 ప్యాడ్లకు 3500 అవుతుంది. ఈ చుట్టు పక్కల ఉన్న 300 గ్రామాల వారు ఈ బాక్సును వాడుకుంటారు. ఒక బాక్సు నిర్వహణ కోసం నెలకు 10 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.
బాక్సు తయారు చేసి పెట్టడానికి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్యాడ్స్ కానీ, బాక్సులు కానీ ప్రొవైడ్ చేసే వారు ఉంటే ఇంకా ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయోచ్చు. ఎక్కువ అమౌంట్ ప్యాడ్స్ కోసం ఖర్చు అవుతుంది. 1000 ప్యాడ్స్ పంచాలంటే.. 35 నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుంది. వీడియో చూసే వాళుల ప్యాడ్స్ కొనుక్కుని ఆఫీస్ అడ్రస్‌కు పంపినా.. కేరళ వదలప్పుడు 1000 ప్యాడ్లు కలెక్ట్ చేసి పంపాను. అప్పుడు ఆంధ్రా యూనివర్శిటీ స్టూడెంట్స్ సహాయంతో కలెక్ట్ చేశాను’’ అని తెలిపారు. మరి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న హరీష్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.