శానిటరీ ప్యాడ్స్ వాడడం ద్వారా క్యాన్సర్ రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ తీవ్ర చర్చకు దారి తీస్తుంది. అసలు శానిటరీ ప్యాడ్స్ వాడకం ద్వారా నిజంగానే క్యాన్సర్ తో పాటు సంతానం కలగకపోవడం వంటి సమస్యలు రానున్నాయా? తాజాగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో అసలు ఏం తేలిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే స్వచ్చంద సంస్థ ఇటీవల శానిటరీ ప్యాడ్స్పై ఓ అధ్యయనం చేసింది. ఈ సర్వేలో శానిటరీ ప్యాడ్స్ వాడకం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీంతో పాటు వంధ్యత్వం రావడం, సంతానం కలగకపోవడం వంటి సమస్యలు కూడా రావొచ్చని తేలింది. అయితే మార్కెట్ లో విక్రయించే ఆర్గానిక్, అకర్బన శానిటరీ ప్యాడ్లలో థాలేట్స్, వీఓసీలు వంటి విషపూరితమైన రసాయనాలు ఉన్నాయని, వీటి ద్వారానే ప్రధానంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా పొంచి ఉందని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంస్థ తేలింది.
మరీ ముఖ్యంగా ప్యాడ్స్ ఫ్లెక్సిబిలిటీ, మన్నిక వంటి వాటిని పెంచడం కోసం కంపెనీలు ప్లాస్టిక్ థాలెట్స్ ను వాడుతున్నారు. ఈ థాలెట్స్ అనేది క్యాన్సర్, సంతానోత్పత్తికి అడ్డుపడడంతో పాటు మగవారికి, ఆడవారికి ప్రతికూల ప్రభావం కూడా చూపిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైతం తెలపడం విశేషం. ఇక ఇదే కాకుండా థాలెట్స్ వల్ల రొమ్ము క్యాన్సర్, ఉబయకాయం, డయాబెటిస్ వంటి రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని మరో నివేదికలో తేలింది. ఇక మొత్తానికి శానిటరీ ప్యాడ్స్ వాడకం ఇన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉండడంతో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు షాక్ కు గురవుతున్నారు. దీనిపై రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.