ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది సోషల్ మీడియాలో స్టార్లు కావటానికి అష్టకష్టాలు పడుతున్నారు.. ఇతరుల్ని పెడుతున్నారు. తాము ఏం చేసైనా సరే లైకులు, అభిమానుల్ని పొందాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. కొద్దిరోజులు క్రితం ఇండియాకు చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టార్ గుడి మెట్ల మీద డ్యాన్స్ చేసి ఇబ్బందుల పాలైంది. తాజాగా, ఓ యువతి కూడా అతి పురాతనమైన పిరమిడ్‌పై డ్యాన్స్ చేసి జనం ఆగ్రహానికి గురైంది. ఈ సంఘటన మెక్సికోలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
మెక్సిలోని చిచెన్ ఇట్జాలో అతి పురాతనమైన మాయన్ పిరమిడ్ ఉంది. ఈ పిరమిడ్‌ను అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి మాయన్ పిరమిడ్పైకి ఓ టూరిస్ట్ యువతి ఎక్కింది. ఎక్కటమే కాదు. దాని మీద డ్యాన్స్ కూడా చేసింది. ఇదంతా గమనిస్తున్న అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెను అక్కడినుంచి కిందకు దిగి రావాలని అరవటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పిరమిడ్ సిబ్బంది ఒకరు పిరమిడ్పైకి ఎక్కాడు. సదరు యువతిని బలవంతంగా కిందకు తీసుకువచ్చాడు. కింద ఉన్న వారంతా ఆమెను తిడుతూ, కేకలు వేశారు.
ఆమెను అక్కడినుంచి తీసుకుపోతుంటే చుట్టూ మూగి బాటిళ్లలోని నీళ్లను ఆమెపై పోయటం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది ఆమెపై చెయ్యి కూడా చేసుకున్నారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విటర్ వేదికగా 7.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1.8 లక్షలకు పైగా లైక్స్ వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. ‘‘ సోషల్ మీడియా సెలెబ్రిటీలకు తెలివి ఉండదు.. పాడు ఉండదు’’ .. ‘‘ కొంతమంది యువతులు తాము సెలెబ్రిటీలు అయిపోవటానికి ఎంతకైనా తెగిస్తారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
A disrespectful tourist climbs an ancient Mayan pyramid in Mexico and gets booed pic.twitter.com/ZMAnwf0Euo
— Fifty Shades of Whey (@davenewworld_2) November 21, 2022