గతంలో ఉన్నట్లుగా కాకుండా ఇప్పుడు కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. చిన్నప్పటి నుండి కష్టపడి పెంచిన పేరెంట్స్ ను అపురూపంగా చూసుకుంటున్నారు. సింగిల్ పేరెంట్స్ గురించి వారే బాధ్యత తీసుకుని ఓ తోడును కావాలని పెళ్లిళ్లు చేస్తున్నారు.
గతంలో పిల్లలు తల్లిదండ్రులతో చాలా చనువుగా ఉండేవారు కాదు. పేరెంట్స్ నిర్ణయాలకు ఎదురు చెప్పేవారు కాదు. ప్రస్తుత కాలంలో అలా కాకుండా పిల్లలు తల్లిదండ్రులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ప్రతి విషయాన్ని పేరెంట్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకుని వానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతలను పాలుపంచుకుంటున్నారు. కొందరు సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్లు వారి బాగోగులు చూసుకోవడానికి పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు.పిల్లలే ముందుండి పేరెంట్స్‌కు అండగా నిలబడుతున్నారు. అలాంటిదే బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపింది. ఆ వివరాలేంటో చూద్దాం..
హిందీ ‘బిగ్ బాస్ 16’ ఫేమ్, బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్ తన తండ్రి తౌకీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. పెళ్లి చాలా దగ్గరగా ఉండడంతో తనే దగ్గరుండి అన్ని చూసుకోవాలని అభిమానులకు తెలిపింది.‘మేము చాలా సంతోషంగా ఉన్నాం. కొత్త దంపతులను మా కుటుంబంలోకి స్వాగతిస్తాం. దీనికి మేము ఆతృతతో ఎదురుచూస్తున్నాం. మా నాన్నగారికి వచ్చే భార్యతో పాటు ఒక కొత్త సోదరి కూడా మా ఫ్యామిలీలోకి వస్తుంది’ అని అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. తండ్రి పెళ్లిచేసుకోబోయే ఆవిడ పేరు నీలోఫర్ అని, ఆమెకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకుందని చెప్పుకొచ్చింది. తనకు రెండేళ్ల పాప కూడా ఉందని చెప్పింది.
సుంబుల్ ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుండి నాన్న తమతో ఉన్నాడని, ఏనాడు అసౌకర్యంగా ఫీలవలేదని చెప్పింది. తను మొదటిసారి పీరియడ్స్ అయినప్పుడు తల్లి పక్కన లేక ఈ విషయాన్ని తండ్రితోనే షేర్ చేసుకున్నానని సుంబుల్ ఎమోషన్ అయింది. తన జీవితంలో ముఖ్య ఘటనలు వాళ్ల నాన్నే ముందు నడిచాడని తెలిపింది. చిన్నప్పటి నుండి కష్టపడి మా కోసం సర్వం ధారపోసి పెంచిన తండ్రికి ఓ తోడును ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పింది. నాన్న సంతోషంగా ఉండాలని తను, తన సోదరి సానియా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సుంబుల్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.