ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సోయగం రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జంటగా నటిస్తోంది. ఇటీవలే విడుదలన పుష్ప టీజర్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో సుకుమార్ హింట్ ఇచ్చశాడు. ఉర మాస్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నాడో రీసెంట్ టీజర్తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. గిరిజన యువతిగా కనిపించబోతున్న హీరోయిన్ రష్మిక మందన్న పాత్రని సుకుమార్ అద్భుతంగా డిజైన్ చేసినట్టు తెసమాచారం. ఇక పుష్పలో నటిస్తున్న జబర్దస్త్ ఫేం అనసూయ పాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతకు ముందు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ కీలక పాత్రలో నటించింది. ఈ పాత్రతో అనసూయకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా సుకుమార్ అనసూయ పాత్రని చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ అనసూయపై కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. ఆగస్టు 13న దక్షిణాది భాషలన్నింటిలో విడుదలవుతున్న పుష్ప సినిమాలో రంగమ్మత్త అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం.