చురుకైన మాటలతో, కొట్టొచ్చే అందాలతో యాంకర్ అనసూయ తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం ఏర్పర్చుకుంది. పలు రకాల టెలివిజన్ ప్రోగ్రాములు చేసి మెప్పించి స్టార్ యాంకర్ గా రాణించింది. ఆ తరువాత సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. తాజాగా బికినీ లో వయ్యారాలు ఒలకబోస్తూ సందడి చేసింది.
బుల్లితెరపై తన యాంకరింగ్ తో అదరగొట్టిన అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో యువత గుండెల్లో రైల్లు పరుగెత్తించిన యాంకర్ అనసూయ యాంకరింగ్ కు విరామం ఇచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటించిన ఆమెకు టాలీవుడ్ లో నటిగా మంచి పేరును సంపాదించిపెట్టాయి. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో పరువాల విందు చేసే అనసూయ తాజాగా మరో సారి బికినీలో మెరిసిపోయింది.
అనసూయ సామాజిక మాధ్యమాల్లో హాట్ ఫోజులతో తళుక్కున మెరుస్తూ మతిపోగొట్టేస్తుంది. తన గ్లామర్ షో తో కుర్రళ్లలో హీట్ పెంచేస్తుంది. సముద్ర తీరాన బికినీ ధరించి హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది. బికినీ అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన కుర్రాళ్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న అనసూయ భర్తతో కలిసి సాగర తీరంలో పరవశించిపోతుంది. ఘాటైన ముద్దుల వర్షంతో భర్తను ముంచేసింది. సముద్రంలో ఎగసి పడుతున్న అలల మధ్య వైట్ బికినీలో ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ వయ్యారాలను ఒలకబోసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హరిహర వీరమల్లు, భోళా శంకర్, పుష్ప2, విమానం సినిమాల్లో అనసూయ నటిస్తోంది.