చురుకైన మాటలతో, కొట్టొచ్చే అందాలతో యాంకర్ అనసూయ తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం ఏర్పర్చుకుంది. పలు రకాల టెలివిజన్ ప్రోగ్రాములు చేసి మెప్పించి స్టార్ యాంకర్ గా రాణించింది. ఆ తరువాత సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. తాజాగా బికినీ లో వయ్యారాలు ఒలకబోస్తూ సందడి చేసింది.
జబర్ధస్త్ షోతో అలరించిన అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో పలు వివాదాస్పదమైన పోస్టులు చేసి నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోయే అనసూయ ప్రస్తుతం ఫోటో షూట్లు తగ్గించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.