తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో తనదైన సత్తా చూపిస్తున్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సొంతమనిషిలా ఆదుకుంటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం పిలల్లతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం రాజన్నపేట, అల్మాస్పూర్ పిల్లలను ఎక్కించుకుని ఓ స్కూల్ బస్సు బయలుదేరింది. ఆ బస్సు ఎల్లారెడ్డిపేట బైపాస్ కార్నర్ […]