రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం పిలల్లతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం రాజన్నపేట, అల్మాస్పూర్ పిల్లలను ఎక్కించుకుని ఓ స్కూల్ బస్సు బయలుదేరింది. ఆ బస్సు ఎల్లారెడ్డిపేట బైపాస్ కార్నర్ వద్దకు రాగానే.. ఈ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఏకంగా 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్థానికులు గమనించి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వెంటనే ఆ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కేటీఆర్ కోరినట్లు సమాచారం. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.