పెళ్లిళ్లలో మ్యూజిక్ తో వచ్చే కిక్కే వేరు. సరదాగా ఫ్రెండ్స్ తో డ్యాన్స్ లు చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వివాహాది కార్యక్రమాల్లో సినిమా సాంగ్స్ వినియోగంపై కాపీరైట్ సంస్థలు రాయాల్టీ వసూల్ చేస్తున్నట్లు కంప్లైంట్స్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
పెళ్లి – రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అంటారు. వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా […]