పెళ్లి – రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అంటారు. వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే. కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్ వెడ్డింగ్‌కి డిమాండ్ పెరిగింది.
కల్యాణ మండపాల్లో వివాహాల మాదిరిగా, వివాహ క్రూయిజ్‌ల ఖర్చులు మనం ఎంచుకున్న పద్దతులని బట్టి మారుతూ ఉంటాయి. సముద్రంలో, ఓడరేవులో రిసెప్షన్ వేడుకలను రెండు ప్రధాన ఖర్చులు ఉంటాయని గుర్తుంచుకోండి. క్రూయిజ్ ఖర్చు, పెళ్లి ఖర్చు., ఎంచుకున్న క్యాబిన్ గ్రేడ్, వివాహానికి అతిథుల సంఖ్య, తీర విహారయాత్రలు క్రూయిజ్ ఎన్ని రోజులు ఉంటాయి. డ్రైవ్ చేయగల పోర్ట్ నుండి బయలుదేరకపోతే, దాన్ని చేరుకోవడానికి విమాన ఖర్చును కూడా కలిగి ఉండాలి. మే నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అంతా వివాహ వేడుకలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కోవిడ్ రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్‌తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది.
డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఇదే సమయంలో అక్కడక్కడ మొదలైన క్రూయిజ్ వెడ్డింగ్ ట్రెండ్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.