వివాహాల వేళ మేనమామలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా మేనకోడలి వివాహం వేళ.. మేనమామ చాలా తంతులు చేయాల్సి ఉంటుంది. అవేకాక.. తనకు చేతనైనంత ఆర్థిక సాయం కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు చదివే ఘటనలో మేనమామలు కోట్ల రూపాయలు మేనకోడలకి కట్నంగా ఇచ్చారు. ఆ వివరాలు..
కట్నం అడిగినవాడు గాడిద అంటారు కానీ, నిజానికి బలవంతంగా అడిగిన వాడే గాడిద. పిల్లనిచ్చిన మావకి స్థోమత లేకపోయినా కట్నం అడిగేవాళ్ళుంటారు చూడండి వాళ్ళు గాడిదలు. అలా కాకుండా అల్లుడి మీద నమ్మకంతో.. ఇతనికి ఇస్తే పర్లేదు.. అని కట్నం కానుకగా ఇచ్చే తండ్రులు ఉంటారు. వీరు ఆ లెక్కలోకి రారు. ఇక్కడ అల్లుళ్ళని తప్పుబట్టడానికి లేదు. అసలు కట్నం, కానుక అని వేరు చేసి మాట్లాడుతున్నారు కానీ, కట్నకానుకలు అని కలిపి మాట్లాడాలి. కట్నం అంటే […]