స్పా, మసాజ్ సెంటర్లు వంటి సంస్కృతిపై అధికారులు కొరడా ఝళిపించనున్నారు. గడిచిన కొన్ని నెలల్లో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినా కూడా ఎక్కడోోచోట స్పా సెంటర్లలో చట్ట వ్యతిరేక చర్యలు జరిగాయి. స్పా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ దిల్లీరావు హెచ్చరించారు. అధికారులు స్పా సెంటర్లపై నిఘా పెట్టి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే […]
నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించిన వీఎంసీ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ హిమ బిందును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీఎంసీఎస్‌ఎల్‌పై సీబీఐ అధికారులు ఫోర్జరీ, మోసం తదితర సెక్షన్ల కింద 2018లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో అక్రమంగా మరికొన్ని కంపెనీలకు నగదును మళ్లించినట్టు గుర్తించారు. అంతేగాక రూ.692 కోట్లకు నకిలీ లెటర్ ఆఫ్ […]