సాంకేతికత రోజురోజుకీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతిదాన్ని సులభతరం చేస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఈ తరం ముందుంది. అందుకే సాంకేతికత ఎక్కువగా ఉండే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వాడకం మరింత ఎక్కువవుతోంది.
యూట్యూబ్ అంటే.. ఒకప్పుడు కేవలం టైంపాస్‌కి మాత్రమే అన్నట్లు ఉండేది. వీడియోలు, సినిమాలు చూడటం మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా.. యూట్యూబ్ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు యూట్యూబ్ ఆదాయవనరుగా మారింది. టాలెంట్ ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూసేవారికి యూట్యూబ్ మంచి ఫ్లాట్‌ఫామ్‌గా మారింది. వంటలు మొదలు.. కంప్యూటర్ లాంగ్వేజెస్ వరకు ఇలా దేనిలో అయినా సరే మన ప్రతిభ గురించి పది మందికి తెలియాలన్నా.. […]
చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా నూటికి దాదాపు 90 శాతం మంది అశ్లీల చిత్రాలు చూస్తున్నారని పలు సర్వేల్లో వెల్లడైంది. వీరిలో చాలా మందికి అది అలవాటును దాటిపోయి వ్యసనంగా మారింది. ఇలాంటి వీడియోలను చూడటానికి కారణాలు ఏవైనా.. వాటిని చూడటం వ్యసనంగా మారటం కారణంగా కలిగే ఇబ్బందుల అన్నీఇన్నీ కాదు. దాని కారణంగా సాధారణ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. దాన్ని నుంచి బయటపడటం చాలా కష్టం.. రోజులో ఎక్కువ భాగం వాటిని చూడాలన్న దానిమీదే […]
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అండగా నిలవాలి! ఆపదల్లో ఉన్నవారిని పోలీసు వ్యవస్థ కాపాడాలి. కానీ.. కృష్ణారావు దంపతుల విషయంలో ఈ రెండూ జరగలేదు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డ ఆ నిరుపేదలకు ప్రభుత్వం ఏ రకంగానూ అండగా నిలవలేదు. గతి లేక ఫుట్‌పాత్‌పై క్షణక్షణ గండంగా జీవిస్తున్న దంపతులను దుర్మార్గుల బారి నుంచి ఏ వ్యవస్థా కాపాడలేకపోయింది. అలాంటి అభాగ్యులు ప్రస్తుతం సమాజంలో ఎందరో ఉన్నారు. తమను ఆదుకుని అండగా నిలిచే […]