సాంకేతికత రోజురోజుకీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతిదాన్ని సులభతరం చేస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఈ తరం ముందుంది. అందుకే సాంకేతికత ఎక్కువగా ఉండే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వాడకం మరింత ఎక్కువవుతోంది.
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని వల్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం ఇప్పుడు బాగా పెరిగింది. గృహోపకరణాలతో పాటు అన్నింటా అధునాతన సాంకేతికత ఉన్న ఉత్పత్తుల వాడకం ఎక్కువవుతోంది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్‌కే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా నచ్చిన స్క్రీన్ సైజులో థియేటర్ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కొన్ని స్మార్ట్ ఫోన్లతో ఈ వీడియో ఎక్స్‌పీరియెన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తోంది. ‘ప్రొజెక్టర్ మోడ్ స్మార్ట్ ఫోన్లతో డిజిటల్ రంగం మరింత స్మార్ట్ కానుందని చెప్పొచ్చు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఇంట్లో, ఆఫీస్‌లో, కార్లలో, వెకేషన్‌కు వెళ్తే అక్కడ కూడా ఇకపై మొబైల్లోని ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూడొచ్చు. మొబైల్స్‌లో ప్రొజెక్టర్ ఇన్‌బిల్డ్ చేసి చైనా, జపాన్, యూఎస్, సౌత్ కొరియాకు చెందిన టాప్ మొబైల్ కంపెనీలు వీటిని తయారు చేశాయి.
లెనోవా, అక్యుమెన్, మోటో-జెడ్, మోవి, శాంసంగ్ బీమ్-2 మోడల్స్ పేరుతో ఈ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఈ ఫోన్లు త్వరలో భారత మార్కెట్లోకి కూడా రానున్నాయి. ఈ మొబైల్స్‌లో ఇంటిగ్రేటెడ్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది. లెనోవా మొదట ఈ ఫోన్లను రూపొందించింది. ఆ తర్వాత మిగతా పోటీ సంస్థలు ఆ దిశగా దృష్టి సారించాయి. ఈ మోడల్ ఫోన్ల ధరలు రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకు పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్ నాణ్యతను బట్టి వీటి ధరలు ఉన్నాయి. హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే క్వాలిటీతో ఉన్న వీడియోలు వీటిల్లో చూడొచ్చు. హోమ్ థియేటర్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. డీటీఎస్ సౌండ్‌తో పూర్తిగా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌తో వీడియోలను చూడొచ్చు. వీడియో ప్రెజెంటేషన్‌కు ప్రొజెక్టర్ల అవసరం లేదు. సెల్‌ఫోన్‌తో వీడియో ప్రెజెంటేషన్ చేయొచ్చు. మరి.. ఈ రకమైన ఫోన్లు మార్కెట్లోకి వస్తే కొనుక్కుంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.