మన దేశం భిన్న సంస్కృతుల, సంప్రదాయాలకు నిలయం. అలానే ఆచార వ్యవహారాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. పెళ్లిళ్ల విషయంలోనూ ఆచారాలు, పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీల సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. తాజాగా ఓ సంప్రదాయం అందరికి ఆశ్చర్యాని కలిగిస్తుంది. పెళ్లి కూతురి బంధువులు బురదలో పొర్లుతూ వరుడికి ఆహ్వానం పలుకుతారు. మరి.. ఈ వింత సంప్రదాయం ఎక్కడంటే...
మన దేశంలో కొన్ని గిరిజన ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు పాటిస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి వింతైన సాంప్రదాయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్లో ఓ వింత ఆచారం జరుపుకుంటారు. ఓ గిరిజన కుటుంబం తన కుమారుడికి కల్వర్టుతో వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు సింగ్భూమ్లో ఒక గిరిజన కుటుంబ సభ్యులు తమ కుమారుడికి అక్కడ ఉన్న కల్వర్టు తో వివాహం […]