మన దేశం భిన్న సంస్కృతుల, సంప్రదాయాలకు నిలయం. అలానే ఆచార వ్యవహారాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. పెళ్లిళ్ల విషయంలోనూ ఆచారాలు, పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీల సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. తాజాగా ఓ సంప్రదాయం అందరికి ఆశ్చర్యాని కలిగిస్తుంది. పెళ్లి కూతురి బంధువులు బురదలో పొర్లుతూ వరుడికి ఆహ్వానం పలుకుతారు. మరి.. ఈ వింత సంప్రదాయం ఎక్కడంటే...
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనది. అందుకే తమ పెళ్లిన జీవితాంతం గుర్తుండేలా జరుపుకోవాలని కోరుకుంటారు. అలానే పెళ్లిళ్ల విషాయానికి వస్తే.. వివిధ ప్రాంతాల్లో వివిధ రకల పద్ధతుల్లో జరుపుకుంటారు. మన దేశంలో భిన్న సంస్కృతుల సాంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పెళ్లిళ్ల విషయంలో భిన్నమైన సంప్రదాయాలు ఉంటాయి. వరుడిని గాడిద మీద ఊరేగించడం, అలానే చీరలు కట్టి నలుగు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇలానే అనేక సంప్రదాయలను పలు పెళ్లిళ్ల మనం చూసే ఉంటాం. తాజాగా ఛత్తీస్ గడ్ ప్రాంతంలో మరో వెరైటీ పెళ్లి ఆచారం ఉంది. పెళ్లి కూతురు తరపు వాళ్లు వరుడికి బురదలో దొర్లుతు ఆహ్వానం పలుకుతారు. మరి.. ఎందుకు అలా చేస్తారు. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశం భిన్న సంస్కృతుల, సాంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ఉన్న వివిధ రకాల కుల, మత, జాతులకు ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ముఖ్యంగా వివాహాల విషయంలో చాలా భిన్నంగా ఉంటాయి. గిరిజనలు, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఛత్తీస్ గడ్ లోని సుర్గజా జిల్లాలోని మాంఝా తెగకు చెందిన వారు తమ పెళ్లిళ్లలో వింతైన సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. వధువు సోదరుల బురదలో పొర్లుతూ వరుడిని ఆహ్వానిస్తారు. పెళ్లి కూతురి సోదరులు గేదెలుగా వేషాలు వేసుకుని బురదలో దొర్లుతూ వరుడిని తమ ఇంటికి స్వాగతిస్తుంటారు. మైన్ పట్ ప్రాంతోలనే నర్మాదాపూర్ ప్రాంతంలో ఉండే మాంఝా తెగకు చెందిన ప్రజలు ఈ సంప్రదాయన్ని ఎన్నో ఏళ్ల నుంచి పాటిస్తున్నారు.
వరుడి బావమరుదులు నడుము వెనుక ఓ తోకను తగిలించుకొని బురదలోకి దిగుతారు. గేదెల్లా పొర్లుతూ.. కొట్టుకోవడం, పరిగెత్తడం వంటివి చేస్తారు. అదే బురద మట్టితో ఉరేగింపుగా వరుడి వద్దకు వెళ్లి స్వాగతం పలికి.. తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇలా బురదల పొర్లుతూ వరుడిని ఆహ్వానిస్తే.. కొత్త జంట సుఖ సంతోషాలతో ఉంటారని అక్కడి వారి నమ్మకం. అంతేకాక ఇలా చేయడం వలన ఇరు కుటుంబాల మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని అక్కడి వారు బలంగా విశ్వసిస్తుంటారు. మరి.. ఈ వింత ఆచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.