ప్రభుత్వ విద్యాసంస్థల్లో చాలా వాటిల్లో మౌలిక వసతుల కొరతతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. ఓ సర్కారు కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
”దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది” అన్న మాట అక్షరాల నిజం. మరి అలాంటి తరగతి గదులు సమస్యలకు నిలయాలుగా మారితే.. దేశ భవిష్యత్ ను మార్చే రేపటి యువత.. ఆ సమస్యల సుడిగుండాల్లో కొట్టుకుపోతుంటే ఇంకెక్కడి అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని స్కూల్లలో అనేక సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్ లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్య తెలిస్తే మనసు కదిలిపోతుంది. ఎక్కడ బాత్రుంకు […]