భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. గతంలో 121 సర్వీసులు తిరిగేవి. అయితే ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా […]
ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మునుపటితో పోల్చితే అనేక రాష్ట్రాలు ‘అన్ లాక్’ ప్రక్రియకు తెరదీశాయి. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది వివరించే అవకాశాలున్నాయి. […]
భారత్ నౌకాదళంలో గొప్పశకం ముగియనుంది. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది. 41 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్ రాజుపుత్ తన సుదీర్ఘ ప్రస్థానానికి శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ అపూర్వ ఘట్టానికి విశాఖపట్టణంలోని నావల్ డాక్‌యార్డ్ వేదిక కానుంది. ఈ యుద్ధనౌకను ఒకప్పటి సోవియట్ యూనియన్ నిర్మించింది. 4 మే 1980న జార్జియాలోని పోటిలో యూఎస్ఎస్ఆర్‌లో అప్పటి […]