దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విపత్కర సమయంలో ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాను నివారించే మార్గాల్లో ఒకటి వ్యాక్సినేషన్. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా డోసుల మధ్య నిడివి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం సూచించింది. నిడివి తగ్గింపు కోసం ముందుగా భారత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఓ అధ్యయనం చేయాల్సి ఉంటుందని […]
ఉత్తరాఖండ్‌లోని పిథౌర్‌గఢ్ జిల్లాలో సరయూ నది ఒడ్డున డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతదేహాలు కరోనా బాధితులకు చెందినవని భావిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ వ్యాప్తి మధ్య గంగతోపాటు ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు కనిపించడం ఇటీవలి కాలంలో సంచలనంగా మారింది. ఈ విధంగా నదీ తీరాలలో మృతదేహాలు కనిపించడం ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని సరయూ నదిలో కూడా మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి. […]
మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్, పాలగఢ్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్‌గఢ్‌లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది. తుఫాన్ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే […]
ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో టెన్షన్ మొదలయిపోతోంది. కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం పీల్చిపిప్పి చేస్తోంది. చూస్తుండగానే లీటర్ల లీటర్ల ఆక్సిజన్ గాలో […]