టీమ్ ఇండియా క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది.. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే క్రికెట్ అభిమానులు సచిన్ ని క్రికెట్ దేవుడు అని పిలుస్తుంటారు. సచిన్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నా ఆయన ఓ అభిమానిని ప్రత్యేకంగా అభిమానిస్తాడు.
టీమిండియా ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ ఆడినా.. అక్కడ ప్రత్యక్షమయ్యే ఒక వ్యక్తి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు సుపరిచితుడే. వళ్లంతా జాతీయ జెండా రంగులను పూసుకుని ఛాతీపై టెండూల్కర్ 10 అని రాసుకుని చేతిలో పెద్ద జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ భారత్ ఆటగాళ్లను ఉత్సహపరిచే సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి క్రికెట్ చూసే ప్రతిఒక్కరికి తెలిసే ఉంటుంది. కాగా సుధీర్ కుమార్‌పై గురువారం పోలీసులు దాడి చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఆఫీసర్ […]