కొవిడ్‌తో బాధపడిన తర్వాత నెగటివ్ వచ్చింది కదా అని ఊరికే ఉండకుండా మంచి పోషకాలున్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. కీళ్లనొప్పులు, శ్వాసతో ఇబ్బంది, పొడి దగ్గు, ఒత్తిడి, డిప్రషన్, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొన్న కొవిడ్ బాధితులు ఈ ఆహారం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు ఉన్న ఆహారంలోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని, ముఖ్యంగా బియ్యం, పప్పు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో ఉండేలా […]
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. ఈ మార్పులకు వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ ఆమోదముద్ర వేసింది. అయితే కొవ్యాక్సిన్ డోసుల గ్యాప్ విషయంలో మాత్రం పాత […]
ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే మరో వైపు వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండటంతో మొదటి డోసు, రెండో డోసు మధ్య గడువును పెంచేందుకు నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే కొవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచొచ్చని ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు చేసింది. కొవిషీల్డ్ టీకాల కోసం డిమాండ్ పెరగడం, సీరం సంస్థ డిమాండ్‌కు అనుగుణంగా తక్కువ సమయంలో ఉత్పత్తి చేయకపోవడంతో మొదటి, […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీటి కొరత తీవ్రతరం అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కాన్సంట్రేటర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వాతావరణంలో ఉండే ప్రాణవాయువును ఉపయోగించి శుద్ధి చేయబడిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆక్సిజన్‌ను హెచ్ఎఫ్ఎన్‌సికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ప్రజలకు ఇళ్ల దగ్గర కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడానికి ఈ కాన్సంట్రేటర్లు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలం నిమిషానికి రెండు, మూడు […]