కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తుంటే భగవంతుడి స్వరూపమే ఆ రూపంలో వచ్చిందా అనిపించక మానదు. ఇటీవల దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని ప్రతి రామాలయంలోనూ జరుపుకుని.. ఆనందించారు భక్తులు. అయితే ఓ గుడిలో జరుగుతున్నరాములోరి వివాహానికి వచ్చి.. అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాయి రెండు వానరాలు.
దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామి వారి పేరునే తల్చుకుంటున్నారు. సాధారణంగా వానరాలు ఇంట్లో ప్రవేశిస్తే గోల గోల చేస్తాయి. వాటికి భయపడి ఇంట్లో నుంచి బయటకు పారిపోయే పరిస్థితి నెలకొంటుంది. కానీ.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వానరం ఇంట్లోకి ప్రవేశించి స్వామి వారి కల్యాణం అయ్యేంతవరకూ అక్కడే ఉండి.. […]