ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఉన్నది అంటే ఒక తల్లి ప్రేమ మాత్రమే. ఏమి ఆశించకుండా ప్రేమను పంచేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆమె.. అమ్మ మాత్రమే. నవమోసాలు మోసి కనిపెంచడమే కాకుండా.. బిడ్డకు ఏ కష్టం కలిగిన తల్లి మనస్సు తల్లడిల్లపోతుంది. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకుంటుంది. అలాంటి అమ్మను వృద్ధాప్యంలో కొందరు కుమారులు కష్ట పెడుతున్నారు.
పిల్లలకు తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమ, ఆప్యాయత చాలా అవసరం. కానీ దురదృష్టం కొద్ది దంపతుల్లో ఎవరైనా చనిపోయినా.. విడిపోయినా.. ఆ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మన సమాజంలో భార్య మరణిస్తే.. చాలా మంది మగాళ్లు.. వెంటనే రెండో పెళ్లి ఆలోచన చేస్తారు. కానీ మహిళలు మాత్రం.. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. రెండో వివాహం ద్వారా తన జీవితంలోకి వచ్చే వ్యక్తి.. పిల్లలను సరిగా చూస్తాడో లేదో అనే అనుమానంతో.. రెండో […]