ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఉన్నది అంటే ఒక తల్లి ప్రేమ మాత్రమే. ఏమి ఆశించకుండా ప్రేమను పంచేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆమె.. అమ్మ మాత్రమే. నవమోసాలు మోసి కనిపెంచడమే కాకుండా.. బిడ్డకు ఏ కష్టం కలిగిన తల్లి మనస్సు తల్లడిల్లపోతుంది. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకుంటుంది. అలాంటి అమ్మను వృద్ధాప్యంలో కొందరు కుమారులు కష్ట పెడుతున్నారు.
ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఉన్నది అంటే ఒక తల్లి ప్రేమ మాత్రమే. ఏమి ఆశించకుండా ప్రేమను పంచేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆమె.. అమ్మ మాత్రమే. నవమోసాలు మోసి కనిపెంచడమే కాకుండా.. బిడ్డకు ఏ కష్టం కలిగిన తల్లి మనస్సు తల్లడిల్లపోతుంది. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకుంటుంది. తన సంతోషాలను వదులుకొని బిడ్డల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అలాంటి తల్లికి తిండి పెట్టకుండా రోడ్డున పడేశారు కొందరు పుత్రులు. తనకుంటూ ఏమి ఆస్తులు, డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బంధువుల ఇంట్లో ఆ వృద్ధురాలు జీవనం సాగిస్తోంది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడేనికి చెందిన గ్రామంలో రాజమ్మ, పోశయ్య దంపతులు ఉండేవారు. వారికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేశారు. కుమారుల్లో ఒకరిని చిన్నతనంలోనే దత్తత ఇచ్చేశారు. మిగిలిన కుమారులు ఆమె దగ్గర ఉండి పెరిగి పెద్దయ్యారు. భర్త ఏడేళ్ల క్రితమే మరణించాడు. ఆమె నివాసం ఉంటున్న ఇళ్లు కూలిపోయింది. ఆ స్థలంలో చిన్నకొడుకు తీసుకొని ఒక ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. ఆమె పేరుపై ఉన్న పట్టాభూమిని పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి..అతడి పేరున రాయించుకున్నాడు.
బతకడానికి నిర్వహణ ఖర్చులు ఇవ్వమన్నా ఇవ్వనంటున్నారని, తిండి పెట్టకుండా రోడ్డున పడేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వాళ్ల దగ్గరికి వెళ్తే అసభ్యంగా మాట్లాడి వెళ్లిపోమన్నారని బాధితురాలు తెలిపారు. చివరకు న్యాయం కోసం సోమవారం ఆ తల్లి తన బంధువులతో కలిసి హనుమకొండ కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. తనకు జరిగిన అన్యాయం గురించి కలెక్టర్ కు చెప్పుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. “నా కుమారులు నుంచి ఎలాగైనా నాకు అయ్యే ఖర్చులు ఇప్పించండి, లేదంటే నా భూమిని తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలి” అంటూ ఆ వృద్ధురాలు బోరున విలపించారు. దీంతో ఆమె ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్.. సమస్యను పరిష్కరించాలని అక్కడి అధికారులకు ఆదేశించారు.