ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో పెద్ద పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారే. దీంతో ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి తోడు కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అవి బోర్డు తిప్పేసరికి బాధితులు లబోదిబోమంటున్నారు.
తల్లిదండ్రులు తాము జీవితంలో సాధించలేని విజయాల్ని.. ఉద్యోగాలను తమ బిడ్డలు సాధించాలి అని కోరుకుంటారు. పిల్లలు అర్థం చేసుకుని.. వారి ఇష్ట పూర్తిగా తల్లిదండ్రుల కలలు నెరవేరిస్తే సంతోషమే. కానీ బిడ్డల ఇష్టాలతో సంబంధం లేకుండా… తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లల మీద రుద్దడం కరెక్ట్ కాదు. కానీ కొందరు బిడ్డలు.. తల్లిదండ్రుల కలలని అర్థం చేసుకుని.. వాటిని సాకారం చేసేందుకు కృషి చేస్తారు.. విజయం సాధిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి […]