ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు ముందు నుండి ఎస్‌బిఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం నాడు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయని భావించిన వినియోగదారులకు.. మొండి చేయి చూపించింది.
దేశీయ అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI)లో సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఏటీఎం లు, యోనో యాప్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోవడంతో కస్టమర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఎస్‌బీఐ యోనో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. దీంతో యోనో యాప్ డౌన్ అయ్యింది. ఎస్‌బీఐ యోనో సర్వీసుల డౌన్ కావడం వల్ల ఈ సమయంలో యోనో ద్వారా బ్యాంక్ సర్వీసులు పొందలేరు. ఎస్బీఐ సేవలకు అంతరాయం కలగడానికి […]