ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు ముందు నుండి ఎస్‌బిఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం నాడు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయని భావించిన వినియోగదారులకు.. మొండి చేయి చూపించింది.
భారత్ బ్యాంకింగ్ వ్యవస్థలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ). ఎక్కువ మంది ఖాతాదారులను కలిగిన బ్యాంక్ ఇది. బ్రాంచీల సంఖ్య, అక్కడ పనిచేసే సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో స్థాపించబడిన ఈ బ్యాంకు అంచలంచలుగా ఎదిగింది. 1955లో ఈ బ్యాంకును ప్రభుత్వం జాతీయం చేసి తన ఆధీనంలోకి తీసుకుంది. రెండు శతాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఈ బ్యాంక్.. తాజాగా ఖాతాదారులకు ఒక్కసారిగా షాక్ నిచ్చింది. దీని సేవలు కొద్ది సేపు నిలిచిపోయాయి.
సోమవారం ఎస్‌బిఐ సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. దీంతో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపు, ఇతర కారణాలతో గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరక్క ఇబ్బంది పడుతున్న ఖాతాదారులు..ఈ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్‌బిఐ అధికారిక యాప్ యోనోతో పాటు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31 నుంచి ఈ సమస్య ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. నాలుగు రోజులైనప్పటికీ సర్వర్లు పునరుద్ధరించకపోవడంపై మండి పడుతున్నారు.
గత 10 రోజుల నుండి ఎస్‌బిఐ బ్యాంక్ సైట్/ యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ అయ్యాయని ఓ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. కొత్త ఆర్థిక సంవత్సరం రెండో వర్కింగ్ డే. మొత్తానికి వెబ్ సైట్ పనిచేయడం లేదని మరో నెటిజన్ పేర్కొన్నారు. సైబర్ అటాక్ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని కొంత మంది వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎస్‌బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్ డిటెక్టర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్‌బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది
@TheOfficialSBI what is wrong with SBI server. Website not opening, yono not working what is this. pic.twitter.com/EdaCQLytcm
— Er. Chaitanya Prasad Murmu (@CHAITANYA_56) April 3, 2023
Dear @FinMinIndia @RBI , Servers of SBI are not functioning properly since 31st March. Today is the 4th day and the site/apps are completely down since the morning. Is this a cyber attack on the bank or just usual #achedin ? Need answers , consumers are taking huge losses.
— Prasad Vedpathak 🇮🇳 (@prasadvedpathak) April 3, 2023
Second working day of the new financial year and the SBI website is down. @TheOfficialSBI @RBI pic.twitter.com/mpRVH5ESBb
— Gaurav Dutta (@dgaurav7) April 3, 2023
I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days.
“NET BANKING IS NOT WORKING”#SBIDOWN— Harsh Patel (@hiharsh07) April 3, 2023