దేశీయ అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI)లో సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఏటీఎం లు, యోనో యాప్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోవడంతో కస్టమర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఎస్‌బీఐ యోనో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. దీంతో యోనో యాప్ డౌన్ అయ్యింది. ఎస్‌బీఐ యోనో సర్వీసుల డౌన్ కావడం వల్ల ఈ సమయంలో యోనో ద్వారా బ్యాంక్ సర్వీసులు పొందలేరు.
ఎస్బీఐ సేవలకు అంతరాయం కలగడానికి గల కారణం మెయింటేనెన్స్ సర్వర్ సాంకేతిక లోపం ఏర్పడటం వల్లనే అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సర్వర్ రన్ అవడంతోనే యోనో యాప్ సేవలు యథావిథిగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు చాలా మందికి సాలరీస్ పడుతుంటాయి.. వారు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యోనో యాప్ ఉపయోగిస్తుంటారు.
సర్వర్ ప్రాబ్లమ్ వల్ల ఈ సర్వీసు పొందలేరని తెలిపింది. ప్రస్తుతం యోనో యాప్ డౌన్ అయ్యింది. ఎస్‌బీఐ యోనో యాప్ వాడే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.