నిరుద్యోగులకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ శుభవార్త చెప్పింది. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా కేవలం షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగానే ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
దేశంలోని అతిపెద్ద, పురాతన బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఖాళీలుగా ఉన్న 1422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. […]