నిరుద్యోగులకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ శుభవార్త చెప్పింది. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా కేవలం షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగానే ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎస్ బీఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రెగ్యులర ప్రాతిపదికనే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం రెండు కేటగిరీలు ఉన్నాయి. రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యూకేషన్ అనే రెండు పోస్టులు ఉన్నాయి. ఔత్సాహికులు ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
మార్చి 15 వరకు ఆన్ లైన్ లో మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వింకలాంగ విద్యార్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఈ పోస్టుల విద్యార్హతల విషయానికి వస్తే.. రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎంబీఏ మార్కెటింగ్, మార్కెటింగ్ లో పీజీడీఎం/పీజీపీఎం చేసి ఉండాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ తో పాటుగా ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఏదైనా స్పెషలైజేషన్ తో పీజీ డిగ్రీ, ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఈ వయసులో కాస్త సడలింపు ఉంటుంది. అభ్యర్థులు అందరిలో షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతై ఈ పోస్టులకు ఎంపికవుతారో వారు కలకత్తాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. రీటైల్ మేనేజర్ పోస్టులు మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకునే వారు 28 నుంచి 38 మధ్య వయసు వాళ్లై ఉండాలి. వీరికి సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 28 నుంచి 55 మధ్య వయసు కలిగిన వాళ్లు అయి ఉండాలి. వీరికి సంబంధిత రంగంలో మూడేళ్ల కనీస అనుభవం ఉండాలని ఎస్ బీఐ స్పష్టం చేసింది.