దేశంలోని అతిపెద్ద, పురాతన బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఖాళీలుగా ఉన్న 1422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: 07-11-2022.
మొత్తం ఖాళీలు: 1422( రెగ్యులర్- 1400; బ్యాక్ లాగ్- 22)
విభాగాలు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
ఎస్‌బీఐ సర్కిల్స్: భోపాల్, భుబనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, మహారాష్ట్ర, కోలకతా, నార్త్ ఈస్టర్న్.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. (మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులే)
వయోపరిమితి: 30-09-2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (అయితే ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ (జనరల్-ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 ఏళ్లు, పీడబ్ల్యూడీ (ఎస్సీ/ఎస్టీ) లకు 15 ఏళ్లు, పీడబ్ల్యూడి(ఓబీసీ) 13 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది)
జీత భత్యాలు: రూ.36000-రూ.63840.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ. 750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు)
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18-10-202
దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.
అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్: నవంబర్/ డిసెంబర్ 2022.
పరీక్ష తేది: 04-12-2022.