అభిమాన తారల సినిమా విడుదల వేళ ఫ్యాన్స్ చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా.. షోలు ఆపేయాల్సి వస్తుంటుంది. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ వివరాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కి సినిమాల్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అకీరాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా తల్లి రేణుదేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. అకీరా విషయంలో మెగా ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు అకీరా సినిమా ఎంట్రీకి సంబంధించిన న్యూస్ చెబుతారా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. అతను ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద ఊహించని […]