అభిమాన తారల సినిమా విడుదల వేళ ఫ్యాన్స్ చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా.. షోలు ఆపేయాల్సి వస్తుంటుంది. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ వివరాలు..
సినిమా తారలకు ఉండే అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అభిమాన తారల సినిమాల విడుదల వేళ ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. అర్థరాత్రి నుంచే థియేటర్ దగ్గర హడావుడి మొదలు పెడతారు. అభిమాన తార భారీ కటౌటులు ఏర్పాటు చేయడం, పూల మాలలు, పాలాభిషేకాలు, టపాసుల మోత.. ఒక్కటేంటి.. అక్కడ హడావుడి చూస్తే.. పెళ్లి జరుగుతుందో లేక ఏదైనా ఫంక్షన్ జరుగుతుందో అనుకుంటారు చూసేవారు. ఇక థియేటర్‌లో సినిమా ప్రారంభం అయ్యాక అరుపులు, కేకలు, పేపర్‌లు చించి చల్లడాలు.. అబ్బో.. ఆ రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో కొందరు అభిమానుల అత్యుత్సాహంతో.. థియేటర్‌లో బాంబులు కాల్చి.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ప్రసుత్తం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు, దర్శకుల కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లుగా నిలిచిన సినిమాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు.. అది కూడా థియేటర్‌లలో విడుదల చేసి మరీ తీసుకువస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఖుషి’, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఒక్కడు’ సినిమాలను రీ రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్లు వసూలు చేశాయి. ఇక కొన్ని రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాను రీరిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా ఆయన కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన దేశముదురు సినిమాను రీరిలీజ్ చేశారు. ఏప్రిల్ 6న ఈ సినిమాను భారీ ఎత్తున రీరిలిజ్ చేయగా.. అభిమానులు విపరీతంగా వచ్చారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అత్యుత్సాహంతో చేసిన ఓ పని కారణంగా.. పోలీసులు థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చి షోను ఆపేయాల్సి వచ్చింది. దేశముదురు రీరిలిజ్ నేపథ్యంలో సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. లోపలే టపాసులు పేల్చి నానా రచ్చ చేశారు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో వారు వచ్చి షోను ఆపేశారు.
ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ (ఎస్‌కేఎన్) ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాక అభిమానులు థియేటర్లలో సీట్లు పాడుచేయొద్దని, క్రాకర్లు పేల్చొద్దని ఆయన రికెస్ట్ చేశారు. దేవాలయాల్లాంటి థియేటర్‌లను రక్షించండి అని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. దేశముదురు.. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్ సంస్కృతి తరలి వచ్చింది.ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక హన్సిక మోత్వాని ఈ సినిమాతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందించారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన పుష్ప-2తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘పుష్ప ఎక్కడ?’ అంటూ ఒక 20 సెకెన్ల వీడియో గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ వీడియోలో ‘పుష్ప 2’ స్టోరీ లైన్‌పై ఓ క్లారిటీ కూడా వచ్చింది. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప..’ “అసలు పుష్ప ఎక్కడ?” అంటూ టీవీ ఛానెల్స్ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Police interpreted the show due to the hugeee crowds and bursting crackers inside Sandhya 70 mm
Request fans don’t damage seats and burst crackers inside theaters
Enjoy the single screen Euphoria Respect and protect theaters which r our temples 🤗❤️#Desamuduru4KSpecialShows pic.twitter.com/YtgCKRFABz
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 6, 2023