పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కి సినిమాల్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అకీరాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా తల్లి రేణుదేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. అకీరా విషయంలో మెగా ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు అకీరా సినిమా ఎంట్రీకి సంబంధించిన న్యూస్ చెబుతారా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.
అతను ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద ఊహించని వాతావరణం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద మెగా వారసుడు అంటూ అకీరా నందన్ కటౌట్ కి పూలమాలలు వేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ కటౌట్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. సినిమాలోకి రాకముందే తమ అభిమాన హీరో వారసుడికి ఈ రేంజ్ లో క్రేజ్ ఉండటం పట్ల షాక్ అవుతున్నారు. అకీరానే మెగా ఫ్యామిలో అందరికంటే హైట్ ఉన్నాడు.18 ఏళ్ల వయస్సున్న అకీరా ఆరడుగుల అజానుబాహుడు.. ఓ స్టార్ హీరోలా కనిపిస్తున్నాడు. పవన్ నటవారసుడిగా ఎంట్రీ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తుంది. అందుకే అభిమానం హద్దు దాటి కటౌట్ రూపంలో ఎక్కింది. ఏ హీరో కొడుకైనా సినిమాలోకి ఎంట్రి ఇచ్చిన తరువాతే స్టార్ అవుతాడు.
కానీ అకీరా ను మాత్రం హీరోగా మారకముందే స్టార్ ని చేశారు అభిమానులు. ఇప్పుడు అకీరా నందన్ కటౌట్ కి పూలమాలలు వేసిన ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవనతున్నాయి. హీరోగా ఎంట్రీగా ఇవ్వకముందే అకీరా క్రేజ్ మాములుగా లేదంటూ అభిమానులు ఆనందంవ్యక్తం చేస్తున్నారు. అకీరా నందన్ కటౌట్ కి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే.. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కటౌట్ కంటే ఎక్కువగా దండలు అతని కటౌట్ కు ఉండడం విశేషం. మరి.. అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఆయన కటౌట్ కి పూలమాలలు వేసి.. అభిమానం చాటుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.