టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 56వ రోజుకి చేరుకుంది. 56వ రోజు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని కోనక్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
Rapthadu: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పరువు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడ్ని అమ్మాయి తరపు వారు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాప్తాడులో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి భార్య వీణ తెలిపిన వివరాల మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల ఒక్కగానొక్క కొడుకు చిట్రా మురళి, అదే గ్రామానికి చెందిన ములుగూరు రామానాయుడు, యశోదమ్మల ఒక్కగానొక్క కూతురు […]