టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 56వ రోజుకి చేరుకుంది. 56వ రోజు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని కోనక్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 56వ రోజుకి చేరుకుంది. 56వ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం సి.కె పల్లి పంచాయతీలోని కోనక్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. కోన క్రాస్ విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన యువతీ, యువకులు, అభిమానులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తన కోసం వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో కంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో మహిళలు లోకేశ్ కు ఆహారతులు ఇచ్చారు.
అలానే లోకేశ్ పాదయాత్రలో మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఉన్నారు. అలానే జ్యోతుల నేహ్రూ కూడా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలో ఓ మహిళ లోకేశ్ బాబుకు పువ్వు ఇచ్చి స్వాగతం పలికింది. అంతేకాక తనను కలవడానికి వచ్చిన యువతులతో కాసేపు లోకేశ్ ముచ్చటించారు. ఇక యువగళంలో పాదయాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో లోకేశ్ అధికార వైసీపీ పై నిప్పులు చేరిగారు. అలానే ధర్మవరం ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇసుక దందా చేస్తున్నారని, ఒకేసారి తొమ్మిది ఇసుక టిప్పర్లు ఎలాంటి పర్మిట్ లేకుండా ఇసుకను బెంగళూరు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. పేరుకే జేపీ కంపెనీకి కాంట్రాక్ట్..కానీ చిత్రావతిలో ఆధిపత్యం మొత్తం కేతిరెడ్డిదేనని, నలుగురు అనుచరులను బినామీలుగా పెట్టుకుని ఇసుకను దోచుకుంటున్నారని లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. 56 రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.