చిన్నారి జీవితాన్ని చిదిమేసిన మానవమృగం శవమైంది. ఈ వార్త ఆ చిన్నారి కుటుంబానికి కొంత ఊరటను మాత్రమే ఇచ్చింది తప్ప గుండె కోతను మాన్పించలేదు. పైగా ఘటన జరిగి ఇన్ని రోజులకు నిందితుడు తప్పించుకుని తిరిగి చివరకు రైల్వే ట్రాక్‌పై శవమై కన్పించడం, అతనిది ఆత్మహత్యనా? ప్రమాదమా? హత్యనా? అనే అనేక అనుమానాలు కలగడం సహజం. అసలు అతను నిందితుడు రాజునేనా అని కూడా చిన్నారి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలు నివృత్తి చేసి, […]
దాదాపు వారం రోజులపాటు తెలంగాణ సహా యావత్ దేశాన్ని అట్టుడికించిన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటన ఓ ముగింపునకు వచ్చింది. నిందితుడు రాజు స్టేషన్‌ఘన్పూర్ వద్ద రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారు. రాజు మరణించాడని తెలిసి అందరూ హమ్మయ్యా బాగా అయ్యింది అని భావిస్తున్నారు. ఇక్కడ కొందరి నోట వినిపిస్తున్న మరో ప్రశ్న అసలు ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందా? […]
సైదబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు మరణించాడు. స్టేషన్‌ఘన్పూర్ రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. చేతిపై ఉన్న పచ్చబొట్టుల ఆధారంగా అతడ్ని రాజుగా పోలీసులు నిర్ధారించారు. అందరూ ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఇందులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రాజు అసలు ఆత్మహత్య చేసుకోలేదు. ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడని అక్కడి రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు. జనగామ జిల్లాకు చెందిన నిందితుడు రాజు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజు అటుగా వెళ్తుండగా […]