తిరుపతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వానలు పడుతున్నాయి. తిరుపతిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాలకు శ్రీవారి సన్నిది తిరుమల అతలాకుతలం […]
అమరావతి- నైరుతి రుతుపవనాల ప్రభావం ఆంద్రప్రదేశ్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీంతో రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలో సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు […]
విశాఖపట్నం- ఆంద్రప్రదేశ్ కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపురాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. […]